ప్రజాశక్తి-కపిలేశ్వరపురం
అంగర లో డిసిసిబి బ్రాంచ్ నూతన భవనాన్ని సోమవారం ఉమ్మడి తూర్పు గొదావరి జిల్లా డిసిసి బి ఛైర్మన్ ఆకుల వీర్రాజు ప్రారంభించారు. అంగర గాంధీ సెంటర్ లో అన్ని వసతులతో నిర్మించిన భవనంలోకి డిసిసిబి బ్రాంచ్ ను మార్చారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి సాపిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రూ.47కోట్ల టర్నోవర్ తో ఉన్న ఈ బ్రాంచ్ ద్వారా రైతులకు, కౌలు రైతులకు వ్యవసాయ , బంగారం , గహ రుణాల వంటి పలు రకాల సేవలు అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి సిఇఒ ఆర్‌వి.నరసింహ రావు, బ్యాంక్ డైరెక్టర్ రాజిబాబు, నాబార్డ్ ఎజిఎమ్ డిడి.స్వామి నాయుడు, జి ఎం.ప్రవీణ్, బ్రాంచ్ మేనేజర్‌లు డి.పట్టాభిరాము, టి.రవికుమార్, సూపర్‌వైజర్ వినరు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










