- 22 వార్డులో చైర్పర్సన్ రాణి పర్యటన
ప్రజాశక్తి-మండపేట : పట్టణ పరిధిలో మెరుగైన పారిశుద్ధ్యనికి కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి అన్నారు. శనివారం స్థానిక 22వ వార్డులో పారిశుధ్య పనులను పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణపై ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి.రామ్ కుమార్, వైస్ చైర్ పర్సన్ పిల్లి గణేశ్వరరావు, టౌన్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, ముక్కా దాలియ్య, మొండి మురళి పాల్గొన్నారు.










