ప్రజాశక్తి-రామచంద్రపురం
గ్రామాల్లో జరుగుతున్న జగనన్న భూ సర్వే పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మంత్రి చెల్లుబోయిన వేణుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చోడవరం గ్రామంలో జరుగుతున్న సర్వే పనుల వివరాలను స్థానిక అధికారులను అడిగికలెక్టర్ హిమాన్షు శుక్టా అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని భూములను పరిశీలించారు. ఇప్పటివరకు ఎంత మేర సర్వే పనులు పూర్తయ్యాయని తదితర వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట రామచంద్రపురం ఆర్‌డిఒ పి.సింధు, తహశీల్దార్ తేజేశ్వరరావు, ఎంపిడిఒ సెలెట్ రాజు, ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.










