Aug 24,2023 23:52

ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లాలో పలుచోట్ల చంద్రయాన్‌-3 విజయోత్సవ ర్యాలీలు జరిగాయి.
అమలాపురం రూరల్‌: చంద్రయాన్‌-3 విజయవంతం కావడం తో దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు బండారులంక గ్రామవాసి, అధ్యాపకుడు మాడా రాము తన ఆనందాన్ని భారతీయుల గొప్ప తన్నాన్ని తన వ్యంగ్య చిత్రం ద్వారా వ్యక్త పరిచారు. నాటి భారత స్వాతంత్య్ర సమరయోధులు మాతభూమి పై జాతీయ జెండాను ఆవిష్కరించిన తీరు, నేటి ఇస్రో శాస్త్రవేత్తల అసాధారణ విజయం తో భారత పాతాకాన్ని చంద్రునిపై ప్రతిష్టించి న తీరును వ్యక్త పరుస్తూ తన సజనాత్మకతను చూపించాడు. కార్టూనిస్ట్‌ రాము చిత్రం పలువురి ని ఆకట్టుకుంది. అమలాపురంరూరల్‌: ఇస్రో కి శుభాకాంక్షలు చెబుతూ గురువారం పాలగుమ్మి ఉన్నత పాఠశాల విద్యార్థులు విన్యాసం ప్రదర్శించారు. చంద్రయాన్‌ 3 విజయం సాధించినందుకు ఇస్రోకి శుభాకాంక్షలు చెబుతూ విద్యార్థులు పాఠశాలలో విన్యాసం చేశారు. విద్యార్థులందరూ వరుస క్రమంలో కూర్చుని ఆట స్థలంలో ఐఎస్‌ఆర్‌ఒ అక్షరాలను అమర్చారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.వెంకటేశ్వరరావు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యా యుడు జె.లక్ష్మణ్‌, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.రామచంద్రపురం: చంద్రయాన్‌-3 విజయాన్ని పురస్కరించుకొని పట్టణంలోని మోడరన్‌ విద్యాసంస్థల ఆధ్వర్యంలో చంద్రయాన్‌-3 విజయభేరి యాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా 750 మంది మోడరన్‌ జిఆర్‌సి జూనియర్‌ కాలేజీ విద్యార్థులు 750 అడుగుల జాతీయ జెండా ప్రదర్శిస్తూ జై విజ్ఞాన్‌ -జై చంద్రయాన్‌ అంటూ ముక్త కంఠంతో నినాదాలు చేశారు. మోడరన్‌ అధినేత లయన్‌ జి.వి. రావు మాట్లాడుతూ చంద్రయాన్‌ -3 విజయంతో యావత్తు భారతదేశం గర్విస్తుందన్నారు. కార్యక్రమంలో మోడరన్‌ ఇంటర్‌ ప్రిన్సిపల్‌ సిహెచ్‌.రాజేష్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ పి.ప్రకాష్‌, అకడమిక్‌ అడ్వయిజర్‌ సిహెచ్‌.శ్రీనివాస్‌, విద్యార్థులు పాల్గొన్నారు. మండపేట: చంద్రయాన్‌ విజయవంతంపై స్థానిక సంగమేశ్వర కాలనీలోని మండల ప్రజా పరిషత్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గురువారం హర్షం వ్యక్తం చేశారు. భారత దేశ ప్రతిష్టను పెంచినందుకు వారికి సెల్యూట్‌ చేస్తూ జాతీయ జెండాలతో అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ముత్యాల మాణిక్యాంబ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.