Sep 11,2023 00:35

ప్రజాశక్తి-యంత్రాంగం
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ అవినీతికి సంబంధించిన కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును సిఐడి పోలీసులు శనివారం అరెస్ట్‌ చేసిన విషయం విదితమే. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆదివారం జిల్లా టిడ ిపి నాయకులు, కార్యకర్తలు రిలేనిరాహార దీక్షలు, నిరసనలు చేపట్టారు.
మండపేట చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా మండపేట ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజాస్వామికంగా, రాజకీయ కక్ష సాధింపుతోనే చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిందని అన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా ఈ అరెస్టును ఖండించాలన్నారు. ప్రభుత్వం, న్యాయస్థానాలు చంద్రబాబును బేషరతుగా విడుదల చేయకపోతే వాడవాడలా ఉదాహరణ దీక్షలు చేపడతామన్నారు. ఉవ్వెత్తున ఒక ప్రజా ఉద్యమంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు నల్లమిల్లి వీర్రెడ్డి, సల్మాన్‌, గుండు వీరతాతరాజు, పిల్లా తాతాలు, మచ్చ నాగు తదితరులు పాల్గొన్నారు. మామిడికుదురు(పి.గన్నవరం) చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా పి.గన్నవరం ప్రధాన జంక్షన్‌ లో ఆదివారం నియోజకవర్గ టిడిపి శ్రేణులు సత్యాగ్రహ దీక్ష ప్రారంభించారు. పి.గన్నవరం నియోజకవర్గ కో కన్వీనర్‌ నామన రాంబాబు మాట్లాడుతూ ప్రజాస్వామికంగా రాజకీయ కక్ష సాధింపు తోనే చంద్రబాబు అరెస్టు జరిగిందన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా ఈ అరెస్టును ఖండిస్తున్నామన్నారు. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద సాగర్‌ టిడిపి అధినేత చంద్ర బాబు అరెస్టు చేసిన తీరును నిరసిస్తూ శిరోమండనం చేయించుకుని ప్రభుత్వం సిఐడి తీరుకు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డొక్కా నాగబాబు, చిట్టూరి శ్రీనివాస్‌,డి.శ్రీనురాజు, ఆరుమిల్లి లాల బాబు, డివివి. సత్యనారాయణ, గణపతి రాఘవులు, మొల్లేటి శ్రీనివాస్‌, బొండాడ నాగమణి, జి.నాగమణి, మట్టపర్తి భారతి,చిన్నం విజయారావు, మందపాటి అనితా కిరణ్‌ కుమార్‌, నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. ఉప్పలగుప్తం చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో జెడ్‌పిటిసి మాజీ సభ్యుడు దేశంశెట్టి వెంకట లక్ష్మీనారాయణ ను ఆదివారం భీమనపల్లిలోని ఆయన స్వగహంలో పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో లక్ష్మీనారాయణ తన ఇంటి వద్దే నిరసన నిరాహార దీక్ష చేపట్టారు. సాయంత్రం టిడిపి నాయకుడు ఆకేటి బాబులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. లక్ష్మీనారాయణ దీక్షకు టిడిపి నాయకులు గుత్తుల నాగేశ్వరరావు, మంచెం బుజ్జి, ఆకేటి పెద్ద, యాళ్ల సత్తిబాబు, ఆకుల కృష్ణమోహన్‌, జంపన శ్రీనివాసరాజు, పెయ్యల తిరుమలరావు, చెన్నూరి దుర్గారావు తదితరులు సంఘీభావం తెలిపారు. అనంతరం సిఎం జగన్‌ కు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమలాపురం చంద్రబాబుకు అరెస్ట్‌కు నిరసనగా అమలాపురంలో టిడిపి నేతలు ఆదివారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు నివాసం వద్ద మాజీ ఎంఎల్‌ఎ ఆనందరావు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసి టిడిపి శ్రేణులు సైకో పోవాలి సైకిల్‌ రావాలి సిఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. రాజోలు చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ కు నిరసనగా మాజిమంత్రి గొల్లపల్లి సూర్యారావు సుమారు 150 మంది కార్యకర్తలతో కలసి ఆదివారం తాటిపాక లోని తమనివాసంలో సామూహిక నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజాస్వామికంగా, రాజకీయ కక్ష సాధింపుతోనే చంద్రబాబు అరెస్టు జరిగిందన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా ఈ అరెస్టును ఖండించాలన్నారు.