Aug 24,2023 23:49

ప్రజాశక్తి-అమలాపురం
అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా పథకాలు లబ్ధిని పొందని వారికి మరో అవకా శం కల్పిస్తూ, చిట్టచివరి లబ్ధిదారుల వరకు సంక్షేమ పథకాలు అందించే ఉద్దేశంతో ఈ ద్వైవార్షిక విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందనిజిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అన్నారు. ఈ మేరకు గురువారం సిఎం జగన్‌ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ద్వైవార్షిక సంక్షేమ పథకాలు లబ్ధి నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలకు జమ చేశారన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ స్థానిక కలెక్టరేట్‌ నుండి వర్చువల్‌ విధానంలో పాల్గొని మాట్లాడుతూ నవర త్నాలు అమలులో భాగంగా జిల్లాలో అర్హులై ఉండి వివిధ కారణాల చేత లబ్ధి పొందని 7, 012 మందికి మరొక అవకాశం ఇచ్చి ద్వివార్షిక కార్యక్రమంలో భాగంగా ఆయా సంక్షేమ పథకాల ఫలాల లబ్ధిని జమ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. సంక్షేమ ఫలాలను అర్హులందరికీ అందించే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు కులం, మతం, వివక్షకు, లంచాలకు తావు లేకుండా అర్హులైన పౌరు లందరికీ లబ్దిని చేకూర్చడం జరుగు తుందన్నారు. కారణాలలో ప్రధానం గా ఆధార్‌ తప్పు సీడింగ్‌, సకాలంలో దరఖాస్తును సమర్పించకపోవడం, బ్యాంక్‌ ఖాతా వైఫల్యాలు, వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన లబ్ధిదారులందరికీ సంక్షేమం మంజూరు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ప్రకారం సంవత్సరానికి రెండుసార్లు ప్రయోజనాలు జూన్‌, డిసెంబర్‌ నెలల్లో ద్వైవార్షిక పద్ధతిలో సంక్షేమ ఫలాల లబ్ధిని జమ చేయడం జరుగుతుందన్నారు. డిసెంబర్‌ 2022 నుండి ప్రారంభించబడిన పథకాల్లో జిల్లాలో 7,012 మంది లబ్ధిదారులు తప్పిపోయారని, నవరత్నాలు బియాన్యుయల్‌ శాంక్షన్స్‌లో జగనన్న అమ్మఒడి ద్వారా 533 మందికి, వైఎస్‌ఆర్‌ ఆసరా గ్రామీణంలో 751 మందికి, అర్బన్‌లో 222 మందికి, జగనన్న విద్యా దీవెన 1,168 మందికి, నేతన్న నేస్తం 9 మందికి, వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా 33 మందికి, జగనన్న తోడు 1,289 మందికి, జగనన్న వసతి దీవెన 854 మందికి వ్యవసాయ పంట రుణాలు 1906 మందికి వెరసి 7,012 మంది లబ్ధిదారులకు రూ.8 కోట్ల 37 లక్షల 53 వేల 699 జమ చేసిన ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి కుడిపూడి సూర్యనారాయణ రావు, హిత కారిణి సమాజం అధ్యక్షురాలు కాశీ బాల మునికుమారి, పురపాలక సంఘ చైర్మెన్‌ రెడ్డి సత్య నాగేంద్ర మణి, దశ్యకళల అకాడమీ చైర్మన్‌ కుడిపూడి సత్య శైలజ, జెడ్‌పిటిసి సభ్యుడు శ్రీహరి, ఎంపిపి కుడిపూడి భాగ్యలక్ష్మి, వక్స్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌, డిఇఒ కమలకుమారి, హ్యాండ్లూమ్స్‌ ఎడి రాజు, జిల్లా గ్రామీణ అభివద్ధి సంస్థ పథక సంచాలకులు వి.శివశంకర్‌ ప్రసాద్‌, సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి పి. జ్యోతిలక్ష్మీ దేవి తదితరులు పాల్గొన్నారు.