Aug 04,2023 18:08

ప్రజాశక్తి-రాజోలు
ఇటీవల ఇండోనేపాల్‌ ఇంటర్నేషనల్‌ సిరీస్‌ లో జరిగిన బ్యాడ్మింటన్‌ జూనియర్‌ విభాగంలో పాల్గొని ఇద్దరు విద్యార్థులు భారతదేశానికి రెండు బంగారు పతకాలను సాధించారు. వివరాల ప్రకారం మలికిపురం డిగ్రీ కళాశాలలోని శ్రీరామ బ్యాడ్మింటన్‌ అకాడమీ నందు శిక్షణ తీసుకున్న ఎం. సుజల( 8వ తరగతి ) ఎం.రియాన్‌ ( 7వ తరగతి ) ఇంటర్నేషనల్‌ సిరీస్‌ లో బంగారు పతకాలని సాధించారని కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. శ్రీరామ బ్యాడ్మింటన్‌ అకాడమీ చైర్మన్‌ దెందుకూరి రాంబాబు రాజు కు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు ఇంటర్నేషనల్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ యలమంచిలి లో చదువుతున్నారని వారి తల్లిదండ్రులు మేడంకి సీత,రాజు తదితరులు అభినందించారు.