బేబిరాణిని పరామర్శిస్తున్న పలువురు నాయకులు
ప్రజాశక్తి - అంబాజీపేట
మాతృ వియోగంతో బాధపడుతున్న సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షులు గోసంగి బేబీరాణిని, సోదరులు సత్యనారాయణ, అయ్యన ్నశాస్త్రి, శ్రీనివాసరావు, అయ్యప్పలను బుధవారం పలువురు పరామర్శించారు. మద్యపాన వ్యతిరేక కమిటీ కాకినాడ జిల్లా కన్వీనర్, పిఠాపురం జెవివి నాయకులు ఎన్.సూర్యనారాయణ బేబిరాణి మాతృమూర్తి సూర్యకాంతం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్థివ దేహాన్ని ప్రజాప్రయోజనాల నిమిత్తం మెడికల్ కళాశాలకు అప్పగించడం అభినందనీయమని, కోనసీమ వాసులు చైతన్యవంతం కావడానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అలాగే పలువురు వైసిపి నాయకులు గోగి శ్రీరామమూర్తి, వాకపల్లి శ్రీను, తదితరులు సూర్యకాంతం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.










