ప్రజాశక్తి -మామిడికుదురు
అప్పనపల్లి బాల బాలాజీ స్వామి శాశ్వత నిత్యాన్నదాన ట్రస్టుకు ఆదివారం పలువురు దాతలు విరాళాలు అందజేశారన్లి ఆలయ సహాయ కమిషనర్ జి.మాధవి తెలిపారు. వల్లూరు వాసులు చిట్టూరి పెద్దిరాజు,భారతిలక్ష్మి దంపతులు రూ.10,116, ఉండ్రాజవరం వాసులు పొడుగు వసంతరావు, వీరవెంకట పద్మజ దంపతులు కుమారులు హరిహర కార్తికేయ, మణికంఠ దేవాన్ష్ పుట్టినరోజుల్లో అన్నదానం జరిపించేందుకు రూ.10,116 విరాళం అందజేసినట్లు తెలిపారు. దాతలకు ధర్మకర్తల మండలి చైర్మన్ చిట్టూరి రామకష్ణ మరియు సభ్యులు స్వామివారి చిత్రపటం ప్రసాదములు అందజేశారు.










