ప్రజాశక్తి-మామిడి కుదురు
అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి ఆలయ సన్నిధిలో రూ.12 లక్షలతో మూడు అభివృద్ధి పనులకు పి. గన్నవరం ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు ఆదివారం శంకుస్థాపన చేశారు. చీకట్ల చిన్నయ్య దంపతులు దాతగా రూ.ఐదు లక్షలతో నిర్మించే గోకులం, అప్పనపల్లి వాసి మద్దుల పుల్లేశ్వర గుప్తా, సావిత్రి దంపతుల దాతగా రూ.3 లక్షలతో స్వామివారి శయన మందిరం, రూ.4 లక్షల వ్యయంతో స్వామివారి యాగ శాల నిర్మాణ పనులకు ఎంఎల్‌ఎ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ చిటూ ్టరి రామకృష్ణ, స్థానిక సర్పంచ్ గెడ్డం మంగా లక్ష్మి, సర్పంచ్‌ల సమాఖ్య అధ్య క్షులు అడబాల రామ సత్యనారాయణ, కొమ్ముల రాము ఆలయ ప్రధాన అర్చకులు శింగరాచార్యలు, ధర్మకర్తలు పాల్గొ న్నారని ఆలయ సహాయ కమిషనర్ జి.మాధవి తెలిపారు.










