Aug 05,2023 23:59

ప్రజాశక్తి-మండపేట
ఆశా వర్కర్ల సమస్యలు తక్షణం పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కె.కష్ణవేణి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆమె కలిసారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నాయకులతో జాయింట్‌ మీటింగు ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించాలన్నారు. పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వేతనాలు ఒక్కసారి ఆశ బ్యాంక్‌ ఖాతాలో జమ చేయాలి, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లో ప్రతి ఆశకు 2500 జనాభా మాత్రమే అప్పగించాలి, వారికి సంబంధం లేని పనులు చేయించరాదు, ఆన్లైన్‌ పనుల భారాన్ని తగ్గించాలి, అధికారుల బెదిరింపులు, వేధింపులు ఆపాలి, నాణ్యమైన సెల్‌ ఫోన్స్‌, జిసిమ్స్‌ తో పాటు శిక్షణ, ప్రభుత్వ, మెడికల్‌ సెలవులు అమలు చేయాలి. రూ.10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలి తదితర డిమాండ్లను వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన డిఎంహెచ్‌ఒ దుర్గారావు దొర తన పరిధిలోని సమస్యల పరిష్కారానికి కషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎస్తేర్‌ రాణి,ఉమా, సీత, రమాదేవి, సరస్వతి, దుర్గ పాల్గొన్నారు.
7న 'చలో కలెక్టరేట్‌' ను విజయవంతం చేయాలి
మండపేట మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుధ్య, ఇంజినీరింగ్‌ విభాగాలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 7న జరగబోయే ఛలో కలెక్టరేట్‌ కార్యక్రమాన్ని కార్మికులంతా వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కె.కష్ణవేణి పిలుపునిచ్చారు. సిఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా వారిని తక్షణం పర్మినెంట్‌ చెయ్యాలని తదితర డిమాండ్స్‌ కోసం సంఘటతంగా పోరాడాలన్నారు.