Sep 09,2023 23:41

ప్రజాశక్తి-ముమ్మిడివరం
అంగన్‌వాడీల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శులు కె.కృష్ణవేణి, జి.దుర్గాప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. మమ్ముడివరం అంగన్‌వాడీ ప్రాజెక్టు నూతన కార్యవర్గం ఎన్నిక శనివారం మండలంలో ఐసిడిఎస్‌ ఆఫీసు వద్ద అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ (సిఐటియు)యూనియన్‌ ఆధ్వర్యంలో ప్రాజెక్టు మహాసభ జరిగింది. ఈ మహాసభకు ప్రతినిధిగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె.కృష్ణవేణి, జి.దుర్గాప్రసాద్‌ హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్‌కు కనీస వేతనం ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌ సౌకర్యం కల్పించాలన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు అనేకసార్లు అంగన్‌వాడీ సమస్యలను విన్నవించినప్పటికీ పట్టించుకోలేదని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో బాలి ంతలకు, గర్భిణులకు చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నప్పటికీ వారుకి మాత్రం చాలీచాలని జీతాలతో బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లేనిపోని యాప్స్‌ ద్వారా వర్కర్స్‌తో చేయించడం ఇంటర్నెట్‌ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ అంగన్‌వాడీన్వాడి వర్కర్స్‌పై రాజకీయ వేధింపులు ఎక్కువ అవుతున్నాయని విమర్శించారు. రాబోయే రోజుల్లో అంగన్‌వాడీ సమస్యలపై దశలవారీగా ఉద్యమం చేపడతామని ప్రభుత్వాలను హెచ్చరించారు. . ఈ మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రాజెక్టు అధ్యక్షులుగా సాపే దుర్గా మహేశ్వరి, కార్య దర్శి కె.జయలక్ష్మి, కోశాధికారి అరుణ, సహాయ కార్యదర్శి ఎ.కుమారి, జి.తలుపులమ్మ, ఉపాధ్యక్షులు గాలి మంగయ్యమ్మ, జి.విజయకుమారి, జి.అనంతలక్ష్ష్మి, సత్య వేణి, మరి కొందరిని కమిటీ సభ్యలుగా ఎన్నుకున్నారు. సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌.సూర్యనారాయణ సంఘీభావం తెలియ జేశారు.