Jul 07,2023 23:17

ప్రజాశక్తి-ఆలమూరు
కూరగాయల వినియోగదారులకు ధరలు అందుబాటులోకి వచ్చాయని మడికి అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్‌ అధ్యక్ష కార్యదర్శులు పాలూరి సత్తిబాబు, చెల్లబోయిన సింహాచలం తెలిపారు. మండలంలోని మడికి కూరగాయల మార్కెట్లో అన్ని రకాల కూరగాయలు రావడంతో శుక్రవారం రేట్లు అమాంతం తగ్గాయి. దీనిపై మార్కెట్‌ కమిటీ మాట్లాడుతూ ఇటీవల కూరగాయలు దిగుబడి తగ్గడంతో రేట్లు అమాంతం పెరిగి వినియోగదారులకు అందనంత దూరాన నిలిచాయి. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలను దిగుబడి చేసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలో అన్ని కూరగాయలు మార్కెట్లోకి వచ్చాయన్నారు. అలాగే వినియోగదారునికి సరసమైన రేట్లుకు అందుబాటులోకి వచ్చాయన్నారు. దీంతో పలువురు వినియోగదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ నిర్వాహకులు వెంకట రామారావు, అందే బుజ్జి, వీరబాబు, దొండపాటి సుబ్బరాజు, తదితరులు ఉన్నారు.
మడికి మార్కెట్లో శుక్రవారం ధరలు ఇలా..
వంకాయలు కేజీరూ.20, బెండకాయలు కేజీ రూ.30, పచ్చిమిర్చి కేజీ రూ.90, బీరకాయలు కేజీ రూ.25, దొండకాయలు కేజీరూ.15, టమాటా కేజీ రూ.80, కాకర కాయలు కేజీ రూ.40, క్యాబేజీ కేజీ రూ.15, క్యారెట్‌ కేజీ రూ.25, బీట్‌ రూట్‌ కేజీ రూ.25, బంగాళాదుంపలు కేజీ రూ.18, తగ్గుదలలో నమోదు కాగా, అల్లం కేజీ రూ.250 ధర ఉంది.