ప్రజాశక్తి-ఉప్పలగుప్తం
జల శక్తి అభియాన్ ద్వారా ఉపాధి హామీ చట్టంలో భాగంగా అభివృద్ధి చేసిన గొల్లవిల్లి యల్లారమ్మ చెరువును డ్వామా పీడీ ఎన్.మధుసూదన్ మంగళవారం పరిశీలిం చారు. చెరువు అభివృద్ధి పనులు పట్ల ఆయన సంతప్తిని వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జాతీయ జెండా ను ఎగురవేసేందుకు చెరువు గట్టుపై ఏర్పాటుచేసిన జెండా దిమ్మ, ఉపాధి హామీ చట్టం ద్వారా చెరువు అభివృద్ధి వివరాలు తెలిపే బోర్డును ఆయన పరిశీలించారు. పీడీ వెంట ఉపాధి ఎపిఒ, వి.రాజామణి, టిఎలు ఎం.దేవి పార్వతి, నాని, సిబ్బంది ఉన్నారు.










