Aug 20,2023 23:40

ప్రజాశక్తి-మండపేట
రాజానగరం ప్రయివేటు కళాశాలలో బిటెక్‌ చదువుతున్న గనిశెట్టి జ్యోతి అఖిలకు చదువు నిమిత్తం మండపేట అమ్మా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం రూ.35 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఫౌండేషన్‌ గౌరవ అధ్యక్షుడు కాళ్లకూరి గొల్లబాబు రూ.15 వేలు, ఐఎస్‌డి ఫౌండేషన్‌ ప్రతినిధి ఇనుపకోళ్ల సత్యనారాయణ రూ.10వేలు, పసలపూడి ప్రకాష్‌ గుప్తా రూ.5 వేలు, మండపేట రోటరీ క్లబ్‌ అధ్యక్షులు చుండ్రు అగస్త్య రాజు రూ.5 వేలు ఆర్థిక సాయంగా అందజేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ అధ్యక్షులు ఇమ్మడిశెట్టి నాగభూషణం, కార్యదర్శి వారణాసి శ్రీదేవి,రోటరీ క్లబ్‌ సభ్యులు బొబ్బా రామకృష్ణ ఓదూరి రమేష్‌, పెందుర్తి ప్రదీప్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.