ప్రజాశక్తి-ఆలమూరు
ఆలమూరు ఎఎంసి నూతన పాలక వర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.ఛైర్మన్‌గా మడికికి చెందిన యనమదల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షునిగా ఆలమూరుకు చెందిన వెత్సా సురేష్ కుమార్‌లను నియమించారు. వీరితోపాటు డైరెక్టర్లుగా షేక్ లాల్ బేబీ, గాడా అన్నపూర్ణ, కటారి కుమారి, గానుగుల లక్ష్మీ దుర్గ, అంగర సింహాద్రి, పోలాబత్తుల భాగ్యవతి, ఉండమట్ల శ్రీలక్ష్మి, తాతపూడి సత్యప్రియ, బుడ్డిగ వీర వెంకటరావు, నెల్లి రమేష్ బాబు, చవ్వాకుల శ్రీనివాస్, సత్తి రామచంద్రారెడ్డి, కుడుపూడి లోవ, పెదపల్ల పిఎసిఎస్ అధ్యక్షుడు నెక్కంటి వెంకటరాయుడు, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, ఆలమూరు సర్పంచ్ నేలపూడి లావణ్య లు ఉన్నారు.
అభినందనలు తెలిపిన ఎంఎల్‌ఎ
ఆలమూరు ఎఎంసి ఛైర్మన్‌గా నియమితులైన యనమదల నాగేశ్వరరావుకు ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి తోపాటు పలువురు నాయకులు అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో ఎంపిపి తోరాటి లక్ష్మణరావు, సర్పంచులు తమ్మన శ్రీనివాస్, గుణ్ణం రాంబాబు తదితరులు ఉన్నారు.










