Aug 28,2023 23:29

ప్రజాశక్తి-రామచంద్రపురం
విజయవాడ బార్‌ అసోసియేషన్‌ సభ్యులు తగరం కష్ట బాబు పై వీరవల్లి పోలీసులు అక్రమ కేసులుబనాయించడం, ఆవులు పవన్‌ కుమార్‌ పై అక్రమ దాడులకు నిరసనగా రామచంద్రపురం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం కోర్టు విధులను బహిష్కరించారు. న్యాయవాదులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, న్యాయవాదులపై దాడులను అందరు ఖండించాలని నినాదాలు చేశారు. దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలనీ, అక్రమ కేసులు బనాయించిన వీరవల్లి పోలీసులు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిల్లి మురళీమోహన్‌ వెంకటరమణ, వాడ్రేవు సాయి ప్రసాద్‌, సంయుక్త కార్యదర్శి చిన్నం వీర్రెడ్డి, జూనియర్‌ న్యాయవాదులు పిల్లా రామయ్య, కె.భరత్‌ కుమార్‌, కోటిపల్లి లోవ రాజు, కెవివి.సత్యనారాయణ, నేలపాటివీరభద్రరావు, ఇంత సుకుమార్‌, వినకోటి గంగాధర్‌, సూరంపూడి గంగాధర్‌, జగదీష్‌, బండి శ్రీను, చోడి జాన్‌ రత్నం తదితరులు పాల్గొన్నారు.