ప్రజాశక్తి-ముమ్మిడివరం
ప్రభుత్వ సిఫా ర్సుల పేరుతో అక్రమ బదిలీ లను నిలుపు దల చేయాలని, బదిలీలు కాబడిన ఉపా ధ్యాయ జీతాలు వెంటనే చెల్లించాలని ముమ్మిడివరం లోని జిల్లా డిఇఒ కార్యాల యం వద్ద యుటిఎఫ్ అధ్యక్షులు పి.వెంకటే శ్వరరావు అధ్యక్షతన గురువారం ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో బదిలీలు జరిగినప్పటికీ దొడ్డి దారిన మరికొందరు ఉపాధ్యాయులను బదిలీ చేశారని వారాల గడుస్తున్న వారికి జీతాలు చెల్లించలేదని వెంటనే జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పిడిఎఫ్ ఎంఎల్‌సి ఐ. వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిరంకుశ వైఖరి అవలంబిస్తుందని అన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.జ్యోతి బస్, గౌరవ అధ్యక్షులు ఎన్‌టివి.సుబ్బారావు, జిల్లా కార్యదర్శి జివి.రమణ, వై.మురళీమోహన్, పెన్నాడ శ్రీనివాస్, జెవివి జిల్లా అధ్యక్షులు జె.సత్యనారాయణ, యుటిఎఫ్ నాయకులు పాల్గొన్నారు.










