Jul 15,2023 15:28
  • దేవస్థానం చైర్మన్ కు వ్యతిరేకంగా నినాదాలు
  • సౌకర్యాలు కల్పించ లేదంటూ భక్తుల మండిపాటు

ప్రజాశక్తి-కొత్తపేట : దక్షిణ భారతదేశంలో పేరుగాంచిన కోనసీమ జిల్లా కొత్తపేట మండలం లోని మందపల్లి మందేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు వసతులు కలిపించకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మందేశ్వర స్వామికి తైలాభిషేకాలు, పూజలు నిర్వహించడానికి శనివారం భక్తులు ఊహించిన రీతి కన్నా అత్యధిక సంఖ్యలో భారీగా తరలివచ్చారు. అయితే భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం వారు విఫలమయ్యారని పలువురు కోపోయారు కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ వారు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో భక్తులు సహనం కోల్పోయి ఈ దేవస్థానానికి చైర్మన్ లేకపోయినప్పటికీ చైర్మన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేవస్థానం చైర్మన్ డౌన్ డౌన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.