Jul 13,2023 22:49

ప్రజాశక్తి-ఆలమూరు
చెముడులంక శివారు గాంధీనగరంలో బుధవారం సంభవించిన అగ్ని ప్రమాదంలో పేరపు పార్వతమ్మ, మీసాల ఈశ్వరమ్మ, మచ్చా రమణమ్మ కుటుంబాలకు వారు నిరాశ్రులయ్యారు. ఆ కుటుంబాలను గురువారం కొత్తపేట ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి సంఘటన స్థలానికి చేరు ఒక్కొక్క కుటుంబానికి రూ.15 వేలు, 50 కిలోల బియ్యం, నూతన వస్త్రాలను అందజేశారు. అలాగే ప్రభుత్వం నుండి అందవలసిన అన్ని పథకాలను వచ్చేటట్లు కషి చేస్తానని ఆ కుటుంబాలకు హామీ ఇచ్చారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్‌ తమ్మన శ్రీనివాసు, గ్రామ వైసిపి అధ్యక్షుడు దొండపాటి వెంకటేశ్వరరావు, దొండపాటి చంటి, అడబాల వీర్రాజు, రాయుడు వెంకటేష్‌, బుడ్డిగ వీర వెంకటరావు, దొండపాటి శ్రీను, బొర్రా వీరబాబు, అడబాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. వివిధ పార్టీలకు చెందిన స్థానిక ప్రతినిధులు వేర్వేరుగా విచ్చేసి మచ్చా రమణమ్మ, పేరపు పార్వతమ్మ, మీసాల ఈశ్వరమ్మలకు బియ్యం, నిత్యావసర సరుకులు, చీరలు, దుప్పట్లు, కొంత నగదును గురువారం అందజేశారు. ఇందులో భాగంగా వైసిపి మండల కన్వీనర్‌, స్థానిక సర్పంచ్‌ తమ్మన శ్రీనివాస్‌ తన పార్టీ శ్రేణులతోను, టిడిపి నేత నాగిరెడ్డి వెంకటరత్నం, నాయకులు, జనసేన నాయకులు తమ్మన భాస్కరరావు, కార్యకర్తలు హాజరై బాధితులను అన్నివిధాలా ఆదుకునేందుకుంటామన్నారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని తహశీల్దార్‌ ఐపి శెట్టి గురువారం ఘటన స్థలాన్ని పరిశీలించారు. అలాగే బాధితుల నంచి వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు.