ప్రజాశక్తి-మండపేట
స్థానిక విజయలక్ష్మి నగర్ లోని డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో మాజీ రాష్ట్రపతి కలామ్ వర్ధంతిని ట్రస్ట్ చైర్మన్ షేక్ మౌలానా ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అబ్దుల్ కలామ్ దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడతున్నామన్నారు. అనంతరం ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ శిబిరంలో ట్రస్ట్ సభ్యులతో పాటు పలువురు రక్త దానం చేశారు. ఈ సందర్భంగా 95వ సారి రక్తదానం చేసిన షేక్ వలిని సత్కరించారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ షేక్ ఇబ్రహీం, మేనేజింగ్ ట్రస్టీలు అతీఖ్, షేక్ చిన్న బదుల్లా, షేక్ మౌలాలి, షేక్ బాషా, ఎండి రెహ్మాన్ , ట్రస్టు ఇమామ్ ముఫ్తీ ముహమ్మద్ ఫరూఖ్, మస్జిద్ అఖ్సా, ట్రస్టు సభ్యులు షేక్ అజ్హర్, ఎండి రబ్బానీ, షేక్ ఖాజా, ఎండి నూరుల్లా, సల్మాన్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురం రామచంద్రపురంలో అబ్దుల్ కలామ్ సేవాదళ్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ రాజ్ కుమారి , అబ్దుల్ కలామ్ సేవాదళ్ ప్రెసిడెంట్ బాబ్జి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ నాయకులు రాము, సిపిఎం నాయకులు నూకల బలరాం మాట్లాడుతూ కలాం సామాన్యుడిగా పుట్టి అంతులేని శిఖరాలను అవలీలగా అందుకున్న అసమాన్యుడని అన్నారు. కార్యక్రమంలో విజయ, అప్పారావు, అభి, నారాయణ స్కూల్ 9వ తరగతి విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. కొత్తపేట విద్యా బాల మందిర్ హైస్కూల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కలామ్ చిత్రపటానికి పాఠశాల కరస్పాండెంట్ ఆర్. అనురాధ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పిం చారు. కార్యక్రమంలో హెచ్‌ఎం నూకపేయి శివరత్నం, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.










