ప్రజాశక్తి-రాజోలు(కోనసీమ) : ఇటీవల అనారోగ్యంతో బాధ పడుతూ బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న రాజోలు మండలం గాంధీ నగర్‌కు చెందిన చిన్నారి పలివెల బ్లేస్సికు హైదరాబాద్ 'వసుధ పౌండేషన్'వారు ఆర్థిక సాయం అందజేశారు. రాజోలు నియోజకవర్గం వసుధ పౌండేషన్ కన్వీనర్ జంపన బుజ్జిరాజు రూ.20,000 అందజేశారు. సేవా కార్యక్రమాలలో వసుధ పౌండేషన్ ఎప్పుడు ముందుంటుందని బుజ్జిరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో బోనం రాజు, అటారం మాస్టర్,తెన్నేటి కిషోర్ , స్టార్ శ్రీను పలువురు పాల్గొన్నారు.










