ప్రజాశక్తి అమలాపురం రూరల్(కోనసీమ) : అమలాపురం స్థానిక శ్రీ వేంకటేశ్వరా డిగ్రీ కళాశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా, ఎస్‌పి శ్రీధర్‌లు సోమవారం అభినందించారు. ఇటీవల విడుదలైన ఏ.పి పీజీ సెట్ ఫలితాల్లో ఎస్‌వి డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ స్టేట్ ర్యాంక్‌లు సాధించారు. చిక్కాల కీర్తి 9, సత్తి భవ్య 13,అల్లు వెంకటలక్ష్మీ 15, ఉప్పుగంటి పావని 19, చీకట్ల మౌనిక దేవీ 29, సి.హెచ్ రూప 78, పి.వల్లి 127, బి.సబినా 184వ ర్యాంకులు సాధించిన వారిలో ఉన్నారని కళాశాల ఏవో అన్నారు. విద్యార్థులను ఉద్దేశించి సివిల్స్ లో కూడా రాణించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె.నరసింహ రావు, ప్రిన్సిపాల్ మనోహర్, ఏ. ఓ కరాటం ప్రవీణ్,యాలంగి వరప్రసాద్, ఎమ్. డి శ్రావణ్ దిలీప్, శ్రీరామ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










