ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి వేడుకలను పురస్కరించుకుని... మండపేటలోని స్థానిక సంఘం కాలనీలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తెలుగు భాషాదినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషను అందరూ అభ్యసించాలని తెలుగులో చదవడం - రాయడం నేర్చుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ముత్యాల మాణిక్యాంబ కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులందరు వివిధ కవులు, తెలుగు తల్లి, గిడుగు వేషధారణలో చూపరులందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










