Sep 05,2023 12:16

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : స్థానిక సంగమేశ్వర కాలనీలోని మండల ప్రజా పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకఅష్ణ చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముత్యాల మాణిక్యాంబ ఆధ్వర్యంలో విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉపాధ్యాయ దినోత్సవ ప్రాముఖ్యతను ప్రధానోపాధ్యాయురాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.