ప్రజాశక్తి - ఆలమూరు(కోనసీమ) : మండలంలో ట్రాన్స్కో రూరల్ లైన్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న టేకి వెంకట సుబ్బారావు సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ట్రాన్స్‌కోలో సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన సుబ్బారావు పదవీ విరమణ కార్యక్రమం ఆలమూరు విద్యుత్ శాఖ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బారావు దంపతులను ఘన సత్కారం చేశారు. సుబ్బారావు తన వృత్తిలో కింది స్థాయి నుంచి ఎల్‌ఐగా చేసిన సేవలను కొనియాడారు. సుదీర్ఘకాలం పాటు ఉన్న అనుభవాన్ని, అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇఇ విజయానంద, ఏడిఈ టి.తిరుమల రావు, ఏఈ వై.లక్ష్మి, రూరల్ లైన్ ఇన్స్పెక్టర్ వి.సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.










