Aug 21,2023 14:54

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంజూరైన రూ.20 లక్షల నిధుల టెండర్‌లో జరుగుతున్న ఆలస్యంపై మండలంలోని గుమ్మిలేరు సర్పంచ్‌ గుణ్ణం రాంబాబు సోమవారం జిల్లా స్పందనలో జేసీకి ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి చేయడంతో రూ.20 లక్షలు నిధులు మంజూరు చేయగా వీటిని సిసి రోడ్‌ నిర్మాణానికి పంచాయతీ తీర్మానం చేయడం జరిగిందన్నారు. అయితే ఈ నిధులకు టెండర్‌ పిలవడంలో గత మూడు నెలలుగా యంత్రాంగం ఆలస్యం చేస్తున్నారని సర్పంచ్‌ రాంబాబు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపులుకు వినతిపత్రం అందజేసి, సిసి రోడ్‌ నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. దీంతో ఆమె స్పందించి టెండర్‌ ఆలస్యంపై విచారణ చేసి, వెంటనే టెండర్‌ పిలిచి సిసి రోడ్‌ నిర్మాణం చేపట్టాలని పంచాయతీ అధికారులకు జాయింట్‌ కలెక్టర్‌ సూచించినట్లు సర్పంచ్‌ రాంబాబు తెలిపారు.