Sep 10,2023 14:23

ప్రజాశక్తి-మండపేట(కోనసీమ) : టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామికంగా, రాజకీయ కక్ష సాధింపుతోనే చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిందన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా ఈ అరెస్టును ఖండించాలన్నారు. ప్రభుత్వం, న్యాయస్థానాలు చంద్రబాబు నాయుడుని బేషరతుగా విడుదల చేయకపోతే వాడవాడలా ఉదాహరణ దీక్షలు చేపడతామన్నారు. ఉవ్వెత్తున ఒక ప్రజా ఉద్యమంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు నల్లమిల్లి వీర్రెడ్డి, సల్మాన్‌, గుండు వీరతాతరాజు, పిల్లా తాతాలు, మచ్చ నాగు తదితరులు పాల్గొన్నారు.