ప్రజాశక్తి మండపేట :టిడిపి పార్టీ యువ నేత నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మండపేటలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ కార్యాలయం నుండి కలవపువ్వు సెంటర్‌హొ మీదుగా కరాచీ సెంటర్‌హొ వరకు గురువారం ర్యాలీ నిర్వహించారు . చేరుకుని అక్కడ నుండి బూరుగుంట చెరువు గట్టు మీదుగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం యువగళం పాదయాత్ర చేస్తున్న తమ యువనేత నారా లోకేష్ చిత్తూరులో పాదయాత్ర మొదలుపెట్టి 200 రోజులు ఏకధాటిగా పాదయాత్ర చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోహొ పాదయాత్ర చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి ,పట్టణ టిడిపి అధ్యక్షులు ఉంగరాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.










