Aug 23,2023 10:38

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : స్థానిక సంగమేశ్వర కాలనీలోని మండల ప్రజాపరిషత్‌ ప్రాధమిక పాఠశాలలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ... ఆయన చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు ముత్యాల మాణిక్యాంబ విద్యార్థులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో ప్రకాశం పంతులు నిర్ణాయక పాత్ర పోషించారని విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట శ్రీధర్‌, శేషారత్నం, తదితరులు పాల్గొన్నారు.