ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : స్థానిక సంగమేశ్వరకాలనిలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ముత్యాల మాణిక్యాంబ ఆధ్వర్యంలో మదర్ తెరిసా జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.హొతెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ''ప్రార్ధించే పెదవుల కన్నా - సాయంచేసే చేతులు మిన్న'' అని ప్రపంచానికి చాటి చెప్పిన మాతఅమూర్తి'' మదర్ తెరిసా అని జీవితములో ప్రతి ఒక్కరు ఎదుటి వ్యక్తికి సాయపడాలనే మానవత్వాన్ని పరిచయం చేసిన సేవామూర్తి అని ఉపాధ్యాయులు చిట్టూరి వెంకట శ్రీధర్ అన్నారు. మదర్ తెరిసా వేషధారణతో విద్యార్థిని చూపరులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.










