ప్రజాశక్తి-మండపేట(కోనసీమ) : పరిశ్రమల్లో కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కే. కృష్ణవేణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండపేట చుట్టుపక్కల అనేక పరిశ్రమలు, రైస్ మిల్లు ఉన్నప్పటికీ వందల మంది కార్మిక వర్గం పనిచేస్తున్న పరిశ్రమలోనూ కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. కార్మికుల హక్కులు కాల రాస్తున్నారని కనీసం పిఎఫ్, ఈఎస్‌ఐ కూడా అమలు చేయటం లేదని కార్మికుల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. కార్మిక శాఖ యాజమాన్యాలకు శాఖగా మారిందన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన గుట్టు చప్పుడు కాకుండా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు కూడా పాటించడం లేదని ఆమె ఆరోపించారు. తక్షణం అన్ని పరిశ్రమంలోనూ భద్రతా ప్రమాణాలు పాటించాలని కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని పిఎఫ్, ఈఎస్‌ఐ, బోనస్ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు.










