ప్రజాశక్తి -అమలాపురం రూరల్ :అమలాపురం రూరల్ మండలం కామనగరువు నల్లా సత్యనారాయణ లేఔట్ లో వేదాంత సి ఎస్ ఆర్ నిధులతో నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానీకి రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ తో కలిసి కామనగరువు సర్పంచ్, సర్పంచుల సమైక్య అధ్యక్షురాలు నక్కా అరుణకుమారి చంద్రశేఖర్ శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా శంకుస్థాపన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు.రూ. 38.5 లక్షల అంచనా వ్యయంతో ఈ వాటర్ ట్యాంక్ ను నిర్మించనున్నట్లు సర్పంచ్ అరుణ కుమారి తెలిపారు. దీంతో ప్రజలందరకు శుద్ధ జలం అందబోతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. వాటర్ ట్యాంక్ ను త్వరితగతిన పూర్తి చేయాలంటే అందరి సహాయ సహకారాలు కావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుడిపూడి భాగ్యలక్ష్మి బాబూ, జడ్పీటీసీ పందిరి శ్రీ హరి రాంగోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ దంగెటి డోలామణి, ఎంపీటీసీ మెండు గంగా భవాని, ఉపసర్పంచ్ రాజలపూడి భాస్కరరావు, వార్డు సభ్యులు, నడిపూడి సర్పంచ్ చెల్లిబోయిన నాని, తాండవపల్లి సర్పంచ్ ఏసుబాబు, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ ఆదినారాయణ, కామనగరువు వైసీపీ గ్రామ కమిటి రాజలపూడి మురళీ కఅష్ణ, వైసీపీ కన్వీనర్లు, నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.










