ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : మాజీ సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని రాజ్యసభ సభ్యులు మాజీ ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కార్యాలయం వద్ద శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో బోస్ మాట్లాడుతూ.. జన రంజకంగా పరిపాలించిన నాయకుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత డాక్టర్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందన్నారు. వాతావరణం బాగాలేదని ప్రజా దర్బార్‌కు వెళ్ళవద్దని చెప్పనా అనుకున్న సమయానికి కార్యక్రమం నిర్వహించాలని వెళ్లి ప్రాణాలకు తెగించిన నాయకుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అని తెలిపారు. కార్యక్రమంలో ఆయన తనయుడు పిల్లి సూర్యప్రకాష్, మున్సిపల్ వైస్ చైర్మన్ కొలమూరు శివాజీ, వైసిపి నాయకులు శీలం గంగరాజు, పోలినాటి ప్రసాద్, అధిక సంఖ్యలో వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.










