Aug 19,2023 15:44

ప్రజాశక్తి-అమలాపురం రూరల్‌ (కోనసీమ) : ప్రతి ఒక్కరికీ ఫలాలు అందించే దిశగా జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ పేర్కొన్నారు. శనివారం మంత్రి స్థానిక రూరల్‌ మండలం పరిధిలో సమనస, రంగాపురం బాబు నగర్‌లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యులతో వారి యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకుని సంక్షేమ ఫలాల లబ్ది ఏ మేరకు చేకూరింది, గ్రామ సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ కుల, మత, వర్గ, పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఇంటికే సంక్షేమం అందజేస్తున్నామని తెలిపారు. పేదల సర్వతోముఖాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆలోచిస్తారని చెప్పడానికి గత నాలుగు సంవత్సరాలుగా అమలు అవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే నిదర్శనమన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీఎం రూపొందించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ అభివద్ధి చెందాలని చిట్ట చివరి లబ్ధిదారుల వరకు సంక్షేమ ఫలాలు అందించే దిశగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా చేపట్టిందని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని సచివాలయ సిబ్బంది, ఆయా శాఖల అధికారుల ను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కె టింగ్‌ శాఖ చైర్పర్సన్‌ దంగేటి డోలామణి రుద్ర, స్థానిక జడ్పీటీసీ పందిరి శ్రీహరి రామ్‌ గోపాల్‌, ఎంపీపీ కుడుపూడి భాగ్యలక్ష్మి బాబు, వైస్‌ చైర్మన్‌ బడుగు మేరీ శ్రీను, కో ఆప్షన్‌ మొసలి స్పర్జన్‌ రాజు, ఎంపీటీసీ ఉడుం రామకృష్ణ, డైరెక్టర్‌ కరేళ్ళ రమేష్‌, ఎంపీటీసీ రేవు శ్రీను, వైస్‌ ఎంపీపీ పొలమురి బాలకృష్ణ, రాజులపూడి మురళి కృష్ణ, కోలా పండు, స్థానిక నాయకులు, గ్రామ వాలంటరీలు, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.