Aug 26,2023 15:55
  • రూ 40 లక్షల సచివాలయ భవన  ప్రారంభం

ప్రజాశక్తి రామచంద్రపురం (కోనసీమ) : గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం జగన్‌ ప్రభుత్వం అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆయన మండలంలోని వేగాయమ్మ పేట పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్రామ స్వరాజ్యం అమలు చేస్తున్న జగన్‌ ప్రతి 2000 మందికి ఒక సచివాలయాన్ని, ప్రతి 50 మందికి ఒక వాలంటీర్‌ను ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలన తీసుకువెళ్లారని ఆయన వివరించారు. అందరికీ ఆరోగ్యం ఉండాలని ఆరోగ్యశ్రీని పేద విద్యార్థులకు విద్యను అందించేందుకు విద్య దీవెన అమ్మఒడి పథకాలు ప్రభుత్వ అమలు చేస్తుందన్నారు. అదేవిధంగా రైతులకు సంక్షేమ పథకాలు పింఛన్‌ వ్యవస్థను ప్రభుత్వం సక్రమంగా అమలు చేస్తుందన్నారు. తాను సేవకుడిగా రామచంద్రపురం వచ్చానని సేవ చేయడమే గొప్ప విషయమని ఆయన వివరించారు. రామచంద్రపురంలో ముగ్గురు నాయకులు ఉన్నారని ఇక్కడ ప్రతిపక్షం లేకుండా ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారని ప్రతిపక్షం లో ఉండే తోట త్రిమూర్తులు సైతం తమ పార్టీలో చేరాలని ఆయన గుర్తు చేశారు. వేగాయమ్మ పేటలో కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాలతో పాటుగా గ్రామానికి ప్రభుత్వం 27 కోట్లు ఖర్చు చేసిందని ఆయన వివరించారు. ప్రజలంతా తిరిగి జగన్‌ను గెలిపించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం వేగాయమ్మ పేటలో 40 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంబటి భవాని, జడ్పిటిసి మెర్నీడి వెంకటేశ్వరరావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పండు గోవిందరాజు, వైసీపీ పార్టీ నాయకులు ఇళ్ళ సూర్యనారాయణ టేకుమూడి సత్యనారాయణ, సర్పంచులు అంబటి తుకారం, సతీష్‌ కుమారి, పిల్లి రాంబాబు, కొత్తపల్లి అరుణ,పీవీవి రమణ, వెల్ల సర్పంచ్‌ సూరిబాబు, పలు గ్రామాల ఎంపీటీసీలు సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.