ప్రజాశక్తి-మండపేట(కోనసీమ) : సంఘం కాలనీలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో హిందీ దివాస్ వేడుకలు ప్రధానోపాధ్యాయులు ముత్యాల మాణిక్యాంబ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. రాజేంద్రసింగ్ జయంతిని పురస్కరించుకుని హిందీ దివస్ జరుపుకోవడం జరుగుతుందని 1949వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన హిందీ భాషను అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించిందని ఉపాధ్యాయులు అన్నారు. అప్పటి నుండి హిందీ దివస్‌గా జరుపుకోవడం ఆనవాయితీ అన్నారు. ప్రపంచంలోనే ఎక్కువగా మాట్లాడే భాషలలో హిందీ భాష రెండవదన్నారు.










