ప్రజాశక్తి-మండపేట(కోనసీమ) : మండలంలోని తాపేశ్వరం శ్రీ చైతన్య స్కూల్లో హరిత భారత్ స్టార్టివింగ్ పోగ్రామ్ వనమహౌత్సవ కార్యక్రమం స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. స్కూల్ ఆవరణలో విద్యార్థుల చేత మొక్కలు నాటించి విద్యార్థులకు చెట్లు పెంచడం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ నియంత్రించి.. భావితరాల కోసం పాటుపడాలన్నారు. కార్యక్రమంలో రీజనల్ ఇన్ ఛార్జ్ నరేష్, వైస్ ప్రిన్సిపాల్ రాము, డీన్ అరుణ్ సి-ఇన్ఛార్జ్ సతీష్, ప్రైమరీ ఇన్ఛార్జ్ ఉమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










