ప్రజాశక్తి-మండపేట(కోనసీమ) : పేదల పెన్నిధి వైఎస్ రాజశేఖరరెడ్డి అని మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి, వైసిపి రాష్ట్ర నాయకులు పట్టాభి రామయ్య చౌదరి, రెడ్డి రాజబాబులు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 74వ జయంతి శనివారం నిర్వహించారు. స్థానిక రాజారత్న జంక్షన్‌లోని వైఎస్సార్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణిలు, బాలింతలు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ఆయన రాష్ట్ర ప్రజల హదయాల్లో సుస్థిర స్థానం సంపాదించు కున్నారన్నారు. సంక్షేమ పథకాల ఆద్యుడు వైఎస్సార్ అని కొనియాడారు. మహానాయకుడి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచు కోవాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, టౌన్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, వైసీపీ నాయకులు ముక్కా సుబ్రహ్మణ్యం, ముక్కా దాలయ్య, మొండి మురళి, సచివాలయం కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్‌ఆర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










