Jul 06,2023 16:12

ప్రజాశక్తి - రామచంద్రపురం (కోనసీమ) : ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్‌లను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష పథకాన్ని ఏర్పాటు చేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆయన గురువారం రామచంద్రపురం మండలంలోని ద్రాక్షారామ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సచివాలయం1,2 లకు ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సామాన్యులకు ఖర్చు లేకుండా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ అధ్యక్షులు అంబటి భవాని, జడ్పిటిసి మెర్నిడి వెంకటేశ్వరరావు, ఏపీ ఐడిసి డైరెక్ట్‌ర్‌ వాసంశెట్టి శ్యామ్‌, ద్రాక్షారామ సర్పంచ్‌ కొత్తపల్లి అరుణ, వెంకటాయపాలెం సర్పంచ్‌ యల్లమెల్లి సతీష్‌ కుమారి, ఎంపీడీవో సెలెట్‌ రాజు, వార్డు సభ్యులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.