ప్రజాశక్తి-అమలాపురం రూరల్ : మలాపురం రూరల్ మండలం పాలగుమ్మి జిల్లా ప్రజా పరిషత్ ఉన్న పాఠశాల విద్యార్థులకు అదే పాఠశాలలో హిందీ స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న బి. జయశ్రీ తండ్రి బి. పవన మూర్తి ( రిటైర్డ్ ఎస్సై) జ్ఞాపకార్థం రూ. 25 వేలు విలువ గల 50 జతల క్రీడా దుస్తులను స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. వెంకటేశ్వర రావు కి అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటుచేసిన సభలో ఈ క్రీడా దుస్తులను విద్యార్థులకు అందజేశారు.విద్యార్థులకు క్రీడా దుస్తులు బహుకరించిన బి జయ శ్రీ ని అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుడిపూడి రామలక్ష్మి,ఎంపీటీసీ సభ్యులు పాలగుమ్మి విజయ, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.










