ప్రజాశక్తి-కపిలేశ్వరపురం(కోనసీమ) : కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లికి చెందిన కంఠం శెట్టి ఆదినారాయణ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో మండపేట జయరామ్ కంటి హాస్పిటల్ వైద్య నిపుణులు కంఠం శెట్టి ప్రతాప్ చౌదరి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. కేట్రాక్ట్ అవసరం ఉన్న వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వైద్య శిబిరంలో కాకినాడ చెందిన కంటి వైద్యరాలు డా.అరుణ, వాసంశెట్టి.విజయ కుమార్, తొగరు జానకి రామయ్య, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










