ప్రజాశక్తి మండపేట (కోనసీమ) : ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు) ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ నెల 24న జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కే.కృష్ణవేణి పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మునిసిపల్ కమిషనర్ టి.రాంకుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణవేణి మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం, ఆప్కాస్ వద్దు పర్మినెంట్ ముద్దు, సంక్షేమ పథకాలు అమలు చేయాలి తదితర డిమాండ్ల సాధనకు 24న జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కామారపు నరేంద్ర కుమార్, కొండ, విజరు, లావరాజు, రాజు, చిన్న, హేమలత, లక్ష్మి, పలువురు కార్మికులు పాల్గొన్నారు.










