ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : ఈ నెల 24న తలపెట్టిన చలో విజయవాడను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కే.కృష్ణవేణి పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం మండపేట మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం, ఆప్కాస్ వద్దు పర్మినెంట్ ముద్దు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోరాటాలతోనే డిమాండ్ల సాధన సాధ్యమని 24న జరిగే చలో విజయవాడను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కామారపు నరేంద్ర కుమార్, కొండ, విజరు, లావరాజు, రాజు, చిన్న, హేమలత, లక్ష్మి కార్మికుల పాల్గొన్నారు.










