Sep 05,2023 16:29

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు నిరసన సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన సమరభేరి కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం ఆర్‌డిఓ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించి అనంతరం అర్‌డిఓ సింధుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు సతీష్‌, నాగరాజు, శ్రీను, షారుక్‌, ప్రసాదు, నాని, దొరబాబు, సత్యనారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు.