ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : స్థానిక సంగమేశ్వర కాలనీలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మా తెలుగు తల్లి'కి మల్లెపూదండ గేయ రచయిత శంకరంబాడి సుందరాచారి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ముత్యాల మాణిక్యంబ విద్యార్థులతో కలిసి చారి చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. 1914 ఆగస్ట్ 10వ తేదీన తిరుపతిలో జన్మించిన ఆయనహొ మాతఅభాష తమిళం అయినప్పటికీ తెలుగుపై ఎంతో మక్కువ చూపేవాడని ఆమె అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










