ప్రజాశక్తి-అమలాపురం రూరల్ (కోనసీమ) : అమలాపురం రూరల్ మండలం కామనగరువు పంచాయతీ 4 వ వార్డుకు చెందిన ఎమ్మెస్‌ఎన్ కాలనీలో రూ.10 లక్షలు పంచాయతీ నిదులతో సీసీ రోడ్డు నిర్మాణానికి సర్పంచ్, సర్పంచుల సమైక్య అధ్యక్షురాలు నక్కా అరుణకుమారి చంద్రశేఖర్ సోమవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజలపూడి భాస్కరరావు, ఎంపీటీసీ మెండు గంగా భవానీ, కార్యదర్శి రాజేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ ఆదినారాయణ, సంసాన బాబీ, సంసాని అబ్బు, పమ్మి తాతాజీ, అయ్యప్ప, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.










