Aug 02,2023 15:16

ప్రజాశక్తి-ఆలమూరు (కోనసీమ) : ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషన్‌ పక్వాడతో గర్భిణీలకు, బాలింతలకు మెరుగైన ఆరోగ్యం సమకూరుతుందని ఎంపిపి తోరాటి లక్ష్మణరావు, జెడ్పిటిసి తోరాటి సీతామహాలక్ష్మీ రాంబాబు అన్నారు. మండలంలోని చొప్పెల్ల అంగన్వాడి కేంద్రాల్లో జరుగుతున్న పోషణ్‌ పక్వాడ కార్యక్రమాన్ని సర్పంచ్‌ దంగేటి చంద్రకళ బాపనయ్య అధ్యక్షతన పంచాయతీ వద్ద ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించగా వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల్లో గర్భిణీలకు పోషకాహార నిమిత్తం అందజేసే ఆహారాన్ని లబ్ధిదారులందరూ తీసుకోవాలన్నారు. దీంతో పుట్టబోయే శిశువు దృఢంగా జన్మిస్తారన్నారు. అలాగే ఆ బిడ్డల్ని కన్న తల్లి కూడా ఆరోగ్యకరంగా ఉంటుందన్నారు. అలాగే పిల్లల్ని శ్రద్ధగా అంగన్వాడి కేంద్రానికి పంపిస్తే వాళ్లకు విద్యతో పాటుగా మంచి నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడానికి అంగన్వాడీ టీచర్స్‌ సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్యామ్‌ సుందర్‌, సూపర్వైజర్‌ వరలక్ష్మి, వైసిపి నేతలు దియ్యన పెద్దకాపు, జాంపోలు మాణిక్యం, దియ్యన వీర్రాజు, వాసన రాజు, తోరాటి దుర్గారావు, గంగాధర్‌, వెంకన్న, కార్యకర్తలు పాల్గొన్నారు.