Sep 03,2023 12:45

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : మండపేట పట్టణంలోని తొమ్మిదవ వార్డ్‌ లో బాబు ష్యూరిటీ భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. వార్డులోని రజకపేట రామాలయం వద్ద తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. 2024 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుచేసే సంక్షేమహొ కార్యక్రమాలను ప్రజలకు బాండ్‌ రూపంలో ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో 9 వ వార్డు కౌన్సిలర్‌ చుండ్రు చిన్న చౌదరి, కనపర్తి సుభ్రహ్మణ్యం, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.