ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : అణుబాంబు దాడులతో అనేక దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయని మండల విద్యాశాఖ అధికారి సోమిరెడ్డి తెలిపారు. శ్రీ గౌతమీ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో హిరోషిమా నాగసాకి దినోత్సవం నేపథ్యంలో బుధవారం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి, జిల్లా విద్యాశాఖాధివారి కమలకుమారి, జిల్లా సైన్స్ అధికారి సుబ్రమణ్యం సారథ్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సోమిరెడ్డి మాట్లాడుతూ.. 1945లో హిరోషిమా, నాగసాకిపై అమెరికా చేసిన అణుబాంబు దాడుల వల్ల ప్రజలు వేలాది మంది చనిపోయారని, అణు ధార్మిక దుష్పరిమాణాలు ఇప్పటికీ అక్కడి ప్రజలు చవి చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభావళి, హిరోషిమా నాగసాకి దినోత్సవ సంబరాల కోఆర్డినేటర్ రామలక్ష్మి, సూర్యలత, రామచంద్రారెడ్డి, సూర్యప్రకాష్, ప్రసాద్, అరుణకిషోర్, రోజా, రజియా బేగం, రూపవతి తదితరులు పాల్గొన్నారు.










